పాల్గొన్న సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో : భద్రాచలం: ఏప్రిల్ 14: టుడే 9 ప్రతినిధి
మారుమూల గ్రామాలు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు వహిస్తే ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించకుండా సురక్షితంగా ఉండవచ్చునని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు.
మంగళవారం నాడు తన ఛాంబర్ లో దేశవ్యాప్తంగా నేటి నుండి ఏప్రిల్ 14 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్స్, హాస్పిటల్, పాఠశాలలు, పల్లె ప్రాంతాలలో గడ్డివాముల దగ్గర, తాటాకు ఇండ్లలో, వంట ఇంట్లో అజాగ్రత్త వలన వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. వారోత్సవాలు సందర్భంగా పలు ప్రముఖ కూడల్లలో మరియు పల్లె ప్రాంతాలలోని సంతలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ప్రత్యేకంగా ప్రాక్టికల్ గా తెలియజేయాలని అలాగే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరంగా అర్థమయ్యే రీతిలో తెలపాలని అన్నారు. ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. వారోత్సవాల్లో భాగంగా వారం రోజులపాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రదర్శనలు, అవగాహన సదస్సులు అగ్నిమాపక శాఖ వారు నిర్వహిస్తారని ప్రజలు ఆ ప్రదర్శనలను తిలకించి అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం అగ్నిమాపక కేంద్రం ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ ఎండి.సాధిక్ అగ్నిమాపక సిబ్బంది రమేష్ , కుమార్, వెంకట్రామిరెడ్డి, హరీష్, ప్రకాష్ , నవీన్ , కిరణ్ తదితరులు పాల్గొన్నారు.









