ఐ టి డి ఏ పి ఓ బి రాహుల్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 20
టుడే 9 ప్రతినిధి
నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆదివాసి బాలిక పట్టుదలతో, ఏకాగ్రతతో మొక్కవోని దీక్షతో ప్రభుత్వ పాఠశాలలో చదివి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్ లో బీటెక్ ఎన్ఐటీలో సీటు సంపాదించిన వాగే సంధ్య తోటి విద్యార్థినిలకు స్ఫూర్తి నింపడానికి మార్గదర్శకురాలిగా నిలవడం చాలా సంతోషమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.
సోమవారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో దుమ్ముగూడెం మండలం పేరాయిగూడెం గ్రామానికి చెందిన వాగే సంధ్య పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్ లో బీటెక్ ఎన్ఐటీలో సీటు సంపాదించిందని ఆయన అన్నారు. ఆమె బీటెక్ ఎన్ఐటి కోర్స్ చదవడానికి ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహకంగా 50 వేల రూపాయల చెక్కును బాలిక తల్లిదండ్రులకు అందించడం జరిగిందని అన్నారు. చెక్కు అందించిన అనంతరం బాలిక తల్లిదండ్రులను అభినందిస్తూ ఖాళీ సమయంలో క్రింది తరగతి విద్యార్థినిలకు తప్పనిసరిగ ఆమె యొక్క ప్రతిభను వారికి తెలియజేసి చదువు పట్ల మక్కువ కలిగేలా స్ఫూర్తి నింపాలని, తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం మోపకుండా నెలకు కొంత ఆర్థిక వెసులు బాటు చేసుకోవడానికి ప్రయత్నించాలని బాలికకు తెలియజేయాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.









