గురుకుల పాఠశాలలో ఆర్చరీ అద్లెటిక్స్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్.
ప్రారంభించిన సర్పంచ్
పూనెం కృష్ణ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 20
టుడే 9 ప్రతినిధి
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆర్చరి అథ్లెటిక్స్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపు 2026,విద్యార్థినీలుసద్వినియోగం చేసుకొని వారికి ఇష్టమైన క్రీడలలో పాల్గొనాలని భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ పూణేం కృష్ణ దొర విద్యార్థినీలకు సూచించారు.
సోమవారం నాడు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆశ్చర్య అథ్లెటిక్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు వారికి ఇష్టమైన వివిధ క్రీడలలో చురుకుగా పాల్గొని అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాఠశాల తరఫున పాల్గొని సత్తా చాటాలని అన్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ హేమలత, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మావతి మాట్లాడుతూ ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల అన్నీ బాలికల పాఠశాలల నుండి సుమారు 100మంది విద్యార్థుల తో , తేది. 20.04.2026 నుండి 29.04.2026 వరకు 10రోజులు గురుకుల సెక్రటరీ శ్రీమతి. సీతాలక్ష్మి ఆదేశాల మేరకు సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే విద్యార్థుల కు క్యాంపులో ప్రాముఖ్యముగా నిర్వహిస్తున్న ఆర్చరి (విలువిద్య ) గురించి వారి విలువైన సందేశం అలాగే అథ్లెటిక్స్ లో భాగంగా పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్ మరియి జోవెలిన్ త్రో, షాట్ పుట్ వంటి తదితర ఆటలను గురించి సంబంధిత పిడి, పీఈటీలు విద్యార్థినిలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో గురుకులం ఏవో నరేందర్ కోచ్లు. పీడీ . కె . గోపాలకృష్ణ, అలాగే పాఠశాల పి ఈ టి , మరియు పిడి .సరిత, స్ . గీత తదితరులు పాల్గొన్నారు.









