*రైతు మహాసభలకు తరలి రండి.
*ఈనెల 23న జరిగే ప్రారంభ సభను విజయవంతం చేయాలి
*సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి
*భద్రాచలంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల విస్తృత ప్రచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 20
టుడే 9 ప్రతినిధి
ఈనెల 23 24 25 తేదీలలో కొత్తగూడెం పట్టణంలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల సందర్భంగా 23 వ తారీఖున జరిగే ప్రారంభ సభకు వేలాదిగా తరలి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని 11 14 వార్డు కమిటీల ఆధ్వర్యంలో రైతు మహాసభల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రైతు సంఘం రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభలకు రైతు సంఘం అఖిలభారత అధ్యక్ష కార్యదర్శులు అశోక్ దావలె విజ్జు కృష్ణన్ తోపాటు ప్రధాన నాయకత్వం పాల్గొంటున్నారని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో దేశవ్యాప్తంగా రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చిస్తారని అన్నారు. భవిష్యత్తులో రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే పోరాటాలను రూపొందిస్తారని నర్సారెడ్డి స్పష్టం చేశారు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆల్ ఇండియా కిసాన్ మహాసభ నిర్ణయాత్మక పాత్ర పోషించిందని మహాత్ర ఉద్యమం తర్వాత జరిగే రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో జరగటం ప్రత్యేకమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయని ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ మహాసభల విజయవంతనికై పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేయాలని నర్సారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ సభ్యులు పుణ్యవతి గణపతి అమ్మ సావిత్రమ్మ స్వరూప శివకుమారి తడికల కుమారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు









