భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 22
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం పట్టణంలోని శ్రీ విద్యా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాధించిన విజయాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పాఠశాల యాజమాన్యం నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ విద్యా స్కూల్స్ చైర్మన్ ఎల్.ఎన్. ఎం.వి. చౌదరి హాజరయ్యారు,ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తు విజయాలు అందుకోవాలని అన్నారు.
తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై తమ పిల్లల విజయాలను ఆనందంగా పంచుకున్నారు.
పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి, వారి ప్రతిభను అభినందించారు. చిన్నారుల ఆనందం, తల్లిదండ్రుల హర్షం మధ్య కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.
శ్రీ విద్యా స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు. తదితరులు పాల్గొన్నారు.









