ప్రజా సమస్యలపై పోరాటమే కామ్రేడ్ మడెం లక్ష్మికి ఘన నివాళి: సీపీఎం నేతలు

  • ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయడమే కామ్రేడ్ మడెం లక్ష్మికి మనం ఇచ్చే ఘన నివాళి.
  • ఆదర్శవంతంగా పనిచేసిన వార్డు మెంబర్ మడెం లక్ష్మి.
  • సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 24
టుడే 9 ప్రతినిధి

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయడమే అమరజీవి కామ్రేడ్ మడెం లక్ష్మికి మనమిచ్చే ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబులు అన్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీ మాజీ 13వ వార్డు మెంబర్, గిరిజన సంఘం నాయకురాలు ఆదివాసి బిడ్డ అమర జీవి కామ్రేడ్ మడెం లక్ష్మి ప్రధమ వర్ధంతి డబుల్ బెడ్ రూమ్ (కెసిఆర్ కాలనీ) మడెం లక్ష్మి నివాస స్థలమునందు జరిగింది. ముందుగా పార్టీ పతాకాన్ని పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి ఆవిష్కరించగా మడెం లక్ష్మి చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుంజ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ భద్రాచలం గ్రామపంచాయతీ పాలకవర్గంలో సిపిఎం పార్టీ నుండి 13 వ వార్డు మెంబర్ గా మడెం లక్ష్మి పనిచేశారని నీతిగా, నిజాయితీగా నిరంతరం ప్రజల సమస్యలపై పని చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. కడవరకు సిపిఎం పార్టీ వార్డు మెంబర్ గా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎర్ర జెండా నీడలో నిలిచారని అన్నారు. తమ వార్డు పరిధిలో రోడ్లు డ్రైన్లు విద్యుత్తు తదితర సమస్యలపై పాలకమండలిలో అధికారులకు విన్నవించి సాధించే వారిని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్ పట్టణ కమిటీ సభ్యులు వుస్తెల జ్యోతి,S అజయ్ కుమార్, డి, రాఘవయ్య శాఖా కార్యదర్శులు కాపుల దుర్గారావు ,సీత , కుంజ విజయ , సారిక, కాపుల లక్ష్మి,రమ డివైఎఫ్ఐ కార్యదర్శి సతీష్ ,కాలనీ వాసులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు