జాఫర్ ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను రచ్చ: ‘మేము కాపులం’ టైటిల్‌పై వాగ్వాదం.. మధ్యలోనే వాకౌట్!

ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను తన తదుపరి ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ, మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ‘మేము కాపులం’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ సిరీస్‌కు కులం పేరు పెట్టడంపై జాఫర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద వాగ్వాదానికి దారితీసింది.

సినిమా ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకోవడం సరైంది కాదని, కాంట్రవర్సీ కోసమే ఈ టైటిల్ పెట్టారా అని జాఫర్ ప్రశ్నించారు. దీనికి శ్రీను బదులిస్తూ తనకు కథ, క్యారెక్టరైజేషన్ నచ్చాయని, అందుకే ఆ టైటిల్‌తో సినిమా చేస్తున్నానని గట్టిగా చెప్పారు. జాఫర్ పదేపదే కులం ప్రస్తావన తీసుకురావడంతో సహనం కోల్పోయిన గెటప్ శ్రీను, “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ ఆగ్రహంతో కుర్చీని తన్ని మధ్యలోనే ఇంటర్వ్యూ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కులం పేరుతో టైటిల్స్ పెట్టడంపై చర్చ జరుపుతుండగా, మరికొందరు మాత్రం ఇదంతా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు ఇలాంటి “స్పూఫ్” లేదా “స్క్రిప్టెడ్” గొడవలతో వార్తల్లో నిలిచిన నేపథ్యంలో, ఇది నిజమైన గొడవనా లేక ప్రమోషనల్ గిమ్మిక్కా అనేది ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు