చలివేంద్రాన్ని ప్రారంభించిన గుండాల ఎంపీటీసీ. వెంకటరామిరెడ్డి…

ఆంధ్ర ప్రదేశ్ ఎటపాక మే 1 : టుడే 9 ప్రతినిధి

పురుషోత్తపట్నం లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు, ప్రత్యేక అధికారి కె శ్రీనివాసరావు ఎం ఆర్ ఓ ,పంచాయతీ సెక్రెటరీ సుబ్బయ్య ఆధ్వర్యంలో న చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజలు అనునిత్యం ఏదో ఒక పని మీద పంచాయతీ ఆఫీస్ కి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది కావున వారికి మంచినీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ సెక్రటరీ సుబ్బయ్య ప్రజలందరికీ ముఖ్యంగా అవసరమైనటువంటి దాహార్తిని తీర్చుట నిమిత్తం త్రాగునీటిని ఈ చలివేంద్రం ద్వారా ఏర్పాటు చేశారు. త్వరలో ఇంకా కొన్ని చలివెంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ వెంకటరామిరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ సుబ్బయ్య, పుట్టి అప్పారావు, పంచాయతీ గుమస్తా, కొండపల్లి నాగేశ్వరరావు వలవల నాగేంద్ర టేకుల సోమరాజు. గ్రామస్తులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు