గిరిజన విద్యార్థులకు సమ్మర్ క్రీడల కోచింగ్ ప్రారంభించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 1
టుడే 9 ప్రతినిధి

 

విద్యార్థులు ప్రతి రోజు క్రమం తప్పకుండా వారికి నచ్చిన క్రీడలలో పాల్గొంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురికాకుండా మనసు ప్రశాంతంగా ఉండటమే కాక మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపక శక్తి తమ ఆధీనంలో ఉంటుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ విద్యార్థులకు సూచించారు.
శుక్రవారం నాడు ఉదయం ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన విద్యార్థులకు క్రీడల సమ్మర్ కోచింగ్ లో భాగంగా లాన్ టెన్నిస్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు వివిధ క్రీడలతోపాటు ప్రత్యేకంగా లాన్ టెన్నిస్ క్రీడల్లో మెలకువలు నేర్పించుటకు ఇటువంటి క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. లాన్ టెన్నిస్ క్రీడలకు సంబంధించిన మెలకువలు సంబంధిత పిడి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలియజేసి వారితో కలిసి ప్రాక్టికల్గా క్రీడలలో పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు. సంబంధిత పీడీలు ప్రతిరోజు విద్యార్థినీ విద్యార్థులకు వారికి నచ్చిన క్రీడలతో పాటు తప్పనిసరిగా లాన్ టెన్నిస్ క్రీడలలో విద్యార్థులు పాల్గొనే విధంగా ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని వారి చేత ప్రతిరోజు సాధన చేయించాలని అన్నారు. విద్యార్థులు కోచులు, పిడీలు లాన్ టెన్నిస్ క్రీడలకు సంబంధించిన మెలకువలు ప్రాక్టికల్గా తెలియజేస్తున్నప్పుడు శ్రద్ధగా చూసి వారు చెప్పిన విధంగా క్రీడలలో పాల్గొంటే లాన్ టెన్నిస్ క్రీడలలో నిష్ణాతులు అయ్యి జాతీయ అంతర్జాతీయ క్రీడలలో కూడా పాల్గొని పథకాలు సాధించవచ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అధికారి గోపాలరావు, పిడి వసంత్, కోచ్ అన్నం వెంకటేశ్వర్లు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు