భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం 6 మే
టుడే 9 ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ “జై శ్రీరామ్ అంటే పైసలు రాలతాయా ” అంటూ చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
“జై శ్రీరామ్” అనేది కేవలం నినాదం కాదని… భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, దేశభక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ శ్రీరాముని నామాన్ని అవమానించేలా మాట్లాడడం ఆమె అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ రహదారులు, గిరిజన సంక్షేమ పథకాలు, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటిని గుర్తించకుండా హిందూ విశ్వాసాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ అసలు మనస్తత్వాన్ని బయటపెడుతోందన్నారు.
పదే పదే పార్టీలు మారుతూ రాజకీయ లాభాల కోసం మాట్లాడే నేతలు ప్రజల ఆధ్యాత్మిక భావోద్వేగాలతో ఆటలాడటం మానుకోవాలని హెచ్చరించారు. హిందూ దేవతలు, నినాదాలపై వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైందని, ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని అన్నారు.
కొండా సురేఖ వెంటనే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెను వెంటనే దేవాదాయ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మారావు, చుక్కపల్లి బాలాజీ, జజ్జూరు మోహన్ కృష్ణ, కుంజా సంతోష్, నిడదవోలు నాగబాబు, ములిశెట్టి రాంమోహన్ రావు, బోడ సత్యనారాయణ, ట్రిపుల్ ఎక్స్ చక్రవర్తి, షేర్ శ్రీను, పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు.









