ఐక్య పోరాటాల యోధుడు కామ్రేడ్ కిరణ్….

  • ఐక్య పోరాటాల యోధుడు కామ్రేడ్ కిరణ్.
  • యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి బోల్లి వెంకటరాజు.
  • ఘనంగా అమరజీవి కిరణ్ ఏడవ వర్ధంతి సభ.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 7
టుడే 9 ప్రతినిధి

విద్యుత్ రంగా కార్మికుల సమస్యలపై ఐక్య ఉద్యమాలను నిర్వహించిన యోధుడు కిరణ్ అని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బొల్లి వెంకటరాజు అన్నారు గురువారం భద్రాచలం డివిజన్ కార్యాలయ లో అమరజీవి కామ్రేడ్ కిరణ్ ఏడవ వర్ధంతిని విద్యుత్ కార్మికులు, యూనియన్ నాయకులు, అధికారులు ఘనంగా నిర్వహించి విప్లవ జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా కార్యదర్శి బొల్లి వెంకటరాజు మాట్లాడుతూ, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కిరణ్ ఐక్య పోరాటాల యోధుడని పేర్కొన్నారు. మూడు దఫాలుగా కాంట్రాక్ట్ కార్మికులను పోరాటాల ద్వారా శాశ్వత ఉద్యోగులుగా మార్చించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జీప్ యాత్ర నిర్వహించి, విద్యుత్ సంస్థలలోని 13 కార్మిక సంఘాలను ఏకం చేసి ఐక్య వేదికను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అలాగే 23 వేల మంది కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తింపు పొందేందుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. కామ్రేడ్ కిరణ్ విద్యుత్ కార్మికుల ఆశాజ్యోతి అని, ఆయన లేని లోటు కార్మికులకు తీరని లోటని అన్నారు. ఆయన ఆశయాలను కార్మికులు ముందుకు తీసుకువెళ్లాలని బొల్లి వెంకటరాజు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలగాని రమేష్ పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ వర్ధంతి సభలో భద్రాచలం సహాయ ఇంజనీర్ రాజారావు, 327 జిల్లా అధ్యక్షులు బి. రామకృష్ణ, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఉదయ రత్నకుమార్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పదిలం శ్రీనివాస్, జి. రవి, శ్రీను, ఖలీం, త్రినాథ్ రెడ్డి, ఏడుకొండలు, రాజు, బాలరాజు, ఉమారాణి, ఎస్‌పీఎం కార్మికులు, మీటర్ రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు