సంగారెడ్డిలో దారుణం: అత్తపై అల్లుడి అఘాయిత్యం

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండల పరిధిలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి, తన భార్యతో గొడవపడుతూ అడ్డువచ్చిన అత్తపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడు నిత్యం తాగి వచ్చి భార్యను వేధిస్తుండటంతో, కూతురి కాపురాన్ని చక్కదిద్దేందుకు వచ్చిన అత్తపైనే ఈ అఘాయిత్యానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

శుక్రవారం రాత్రి నిందితుడు మద్యం తాగి వచ్చి, మటన్ వండలేదనే నెపంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో అల్లుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన అత్తను బూతులు తిడుతూ నెట్టేశాడు. అనంతరం భార్యను ఒక గదిలో బంధించి, అత్తను మరో గదిలోకి లాక్కెళ్లి తలుపు గడియపెట్టి అత్యాచారం చేశాడు. నిందితుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, బాధితురాలు గది నుండి బయటకు వచ్చి తన కుమార్తెకు జరిగిన విషయం తెలిపి పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు వట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు