కాకతీయ యూనివర్సిటీ వి. సి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన. గిరిజన బి. ఎడ్, కళాశాల ప్రిన్సిపాల్ బృందం.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.

భద్రాచలం మే 9
టుడే 9 ప్రతినిధి

గిరిజన సంక్షేమ శాఖ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిరిజన బి.ఎడ్ కళాశాల ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్. ఇతర ఉన్నత అధికారుల ఆదేశాలు, సహాయ సహకారాలతో వారి పర్యవేక్షణలో కళాశాల అద్భుతంగా నిర్వహించబడుతుందని వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డికి బి. ఎడ్, కళాశాల ప్రిన్సిపల్ కనకదుర్గ భవాని. అధ్యాపక బృందం వివరంగా తెలియజేశారు.
శుక్రవారం నాడు రాత్రి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న మోడరేషన్ కమిటీ సమావేశంలో వి. సి. ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి కలిసి కళాశాల స్థాపన లక్ష్యాలు, గిరిజన విద్యార్థుల విద్యా అవకాశాలు, వారి శిక్షణ కార్యకలాపాలు, కళాశాల సాధిస్తున్నటువంటి అత్యుత్తమ ఫలితాలు, ఉపాధ్యాయులుగా గిరిజన విద్యార్థులు స్థిర పడటమే కాకుండా గిరిజన సమాజానికి అందిస్తున్నటువంటి సేవలను గూర్చి సవివరంగా తెలియజేయడం జరిగిందని ఆమె అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ వి సీ . కాకతీయ యూనివర్సిటీ విద్యా విభాగం అధికారులు అందిస్తున్న సహాయ సహకారాల వల్ల గిరిజన బి.ఎడ్ కళాశాల సత్ఫలితాలు సాధించడానికి అవకాశం ఏర్పడిందని అందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు.
కళాశాలలో ప్రస్తుతం మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం శిక్షణ పొందుతున్న విద్యార్థుల యొక్క రికార్డ్స్ సంబంధించిన మోడరేషన్ యూనివర్సిటీలో జరుగుతున్న సందర్భంలో కళాశాల బృందం విద్యా విభాగం మోడరేషన్ కమిటీ ముందు హాజరై ఆయా రికార్డులను మొత్తాన్ని పరిశీలింప చేసి వారి ప్రశంసలు పొందడం జరిగిందని, విద్యార్థులు రూపొందించిన రికార్డులు శిక్షణ సంబంధ మైనటువంటి అంశాలను పరిశీలించిన విద్యా విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేసారని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా విద్యా విభాగం డీన్ ప్రొఫెసర్ రామనాథ్ కిషన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ విజయలత, విద్యావిభాగం ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు మోడరేషన్ బోర్డు సభ్యులు కళాశాల సిబ్బందిని విద్యార్థులను అభినందించారు.

కాకతీయ యూనివర్సిటీకి హాజరైన కళాశాల బృందంలో ధనలక్ష్మి, రాంబాబు, నవీన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు