నేటి నుండి ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ….

 

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 11
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం మండలంలో జనాభా గణన లో భాగంగా నేటి నుండి ఇండ్ల జాబితా మరియు ఇండ్లగణన. ప్రక్రియ ప్రారంభం అవుతుందని భద్రాచలం సెన్సస్ ఛార్జ్ అధికారి, తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 78 ఇండ్లగణన బ్లాకులుగా గుర్తించి సూపర్వైజర్లు మరియు ఎన్యుమరేటర్లను నియమించడం జరిగిందని, సోమవారం నుండి (11-05-2027)ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి భవనములు, గణన గృహాలు, కుటుంబాలను గుర్తిస్తారని,అలాగే నివాస. నివాసేతర గృహాలను గుర్తిస్తారని, షెడ్యూల్ లో ఉన్న 34 ప్రశ్నలు ప్రతి గణనగృహంలో అడిగి సమాధానాలను డిజిటల్ గా యాప్ లో నమోదు చేస్తారనీ, గణన గృహం స్థితి,కుటుంబ యజమాని వివరాలు,కుటుంబమునకు లభించుచున్న వసతులు, కుటుంబములో కలిగివున్న ఆస్తులు సేకరిస్తారని, జనగణన లో ప్రతి కుటుంబం పాల్గొనాలని, ప్రజలు ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లకు సహకరించాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు