ఉద్దీపకం వర్క్ బుక్ తయారీకి ప్రణాళికలు రూపొందించాలి.:ఐటీడీఏ పి ఓ బి రాహుల్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 12
టుడే 9 ప్రతినిధి

గిరిజన సంక్షేమ శాఖ జిపిఎస్ పాఠశాలలో చదివే చిన్నారులకు విద్యాభ్యాసం బేస్ లెవెల్ పునాది బలోపేతం కావడానికి ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం వలన చాలావరకు పిల్లల చదువు మెరుగైనందున ఈ సంవత్సరం కొద్దిగా మార్పులు చేర్పులతో ఉద్దీపకం వర్క్ బుక్ తయారీకి ప్రణాళికలు రూపొందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత ఎస్ సి ఆర్ పి లు ఉపాధ్యాయులకు సూచించారు.

మంగళవారం నాడు తన చాంబర్లో ఎస్ సి ఆర్ పిలు మరియు ఉపాధ్యాయులతో ఉద్దీపకం వర్క్ బుక్ తయారీకి ప్రణాళికలు రూపొందించడానికి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్దీపకం వర్క్ బుక్ లో మార్పులు చేర్పులు చేసి మూడో తరగతి పిల్లలకు వర్క్ బుక్ నిర్వహణ నిరంతరం చేస్తూ ఉండాలని, ఇంగ్లీష్ వర్క్ బుక్ లో కొద్దిగా స్టాండర్డ్ పెంచి పిల్లలకు అర్థమయ్యే రీతిలో సైంటిస్ట్, మహనీయులు, సైన్స్ అలాగే ప్రపంచానికి సంబంధించిన అంశాల వివరాలు పొందుపరిచి పిల్లలు చదవడం రాయడంతో పాటు సులభంగా అర్థం చేసుకుని మేధాశక్తిని పెంపొందించుకునేలా సంబంధిత ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి యాక్షన్ ప్లాన్ తయారుచేసి ఆగస్టు 31 వరకు ఉద్దీపకం వర్క్ బుక్ పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత జూన్ 20వ తారీకు నాడు పిల్లలందరకు అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంగ్లీష్ వర్క్ బుక్ లోని అంశాలు పిక్చర్ బేస్ లెవెల్ మాత్రమే ఉండాలని, తెలుగు వర్క్ బుక్ లోని అంశాలు చాలా వరకు మార్పులు చేర్పులు చేయాలని అన్నారు. అలాగే ఏడవ తరగతి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలకు కాంపిటేటివ్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అర్థమయ్యే రీతిలో ప్రత్యేకంగా లెక్కలు.ఇంగ్లీషులో వర్క్ బుక్ తయారుచేసి వారానికి రెండుసార్లు ప్రత్యేక తరగతులు నిర్వహించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధన జరిగేలా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. జిపిఎస్ పాఠశాల చిన్నారులతో పాటు ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని విద్యాభ్యాసం మెరుగుపరుచుకునేల సంబంధిత ఉపాధ్యాయులు, ఎస్ సి ఆర్ పి లు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఏ సి ఎం ఓ రమేష్, ఎస్ సి ఆర్ పి లు . ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు