- యోగ. మెడిటేషన్. పై ఉపాధ్యాయులకు విద్యార్థులకు పలు సూచనలు.
- డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 12
టుడే 9 ప్రతినిధి
విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా, మెడిటేషన్ వంటి ఆసనాలు చేయడం వలన మానసిక ఒత్తిడిని అధిగమించి మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నదని , శారీరక మానసిక ఆరోగ్యమునకు ఇది ఎంతో దోహదపడుతుందని భద్రాచలం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ విద్యార్థులకు సూచించారు.
మంగళవారం నాడు డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండవ రోజు విద్యార్థులకు మెడిటేషన్, యోగ మొదలైన వాటిపై విద్యార్థులకు పలు సూచనలు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మానసికంగా ఉల్లాసంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి ప్రత్యేకంగా ఆరోగ్య సూత్రాలు ఒక అలవాటుగా మార్చుకోవాలని ప్రబోధించారు.
కళాశాల యోగ అండ్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్. ఇన్చార్జి డాక్టర్ నాగ సమీర మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మంచి ఆరోగ్యం మనకుంటే మంచి ఆలోచనలతో దేశాన్ని ప్రగతి పధములో పయనింప చేయవచ్చని , ప్రతి విద్యార్థి మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు.
అనంతరం మెడిటేషన్ మరియు కొన్ని యోగాసనాలు అధ్యాపకుల చేత విద్యార్థుల చేత వేయించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం. విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









