భద్రాచలంలో ఘనంగా హనుమాన్ జయంతి…

  • భద్రాచలంలో ఘనంగా హనుమాన్ జయంతి.
  • పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు భాగాల శ్రీనివాస్ రెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 12
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం, వెంకటేశ్వర కాలనీలోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో విశేష పూజల ఘనంగా జరిగాయి. ప్రధాన కార్యక్రమాలు హనుమాన్ జయంతి ని పురస్కరించుకుని స్వామి వారికి విశేషంగా ఆకు పూజ నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం .లోక కల్యాణం కోసం శ్రీ సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా, కనుల పండువగా నిర్వహించారు.
అన్న ప్రసాద వితరణ. కల్యాణం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.
భక్తుల సందడి .ఈ వేడుకను తిలకించడానికి భద్రాచలం పరిసర ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులంతా స్వామివారి కల్యాణాన్ని తిలకించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు.
ముఖ్య అతిథులు పాల్గొన్న వారు:
అన్న ప్రసాద వితరణ దాత. బోగాల శ్రీనివాస రెడ్డి దంపతులు.
ఈ కార్యక్రమంలో
విష్ణుమొలకల రామ్ ప్రసాద్, రేపాక రాంబాబు, రేపాక రవికిరణ్,రేపాక సతీష్,
పునేం కృష్ణ సర్పంచ్, వెంకటేశ్వర్లు తాసిల్దార్
పుల్లయ్య ఆర్టీవో, తాండ్ర నరసింహారావు,అన్నెం రామిరెడ్డి, రాసమళ్ల రాము,పద్మ, వసంతల రాజేశ్వరి, తుమ్మల రాణి, వీరితో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్త సమాజం మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు