కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  రామాలయం చుట్టుపక్కల మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని. భద్రాచలం తాసిల్దార్ కి వినతి.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 16
టుడే 9 ప్రతినిధి

భారత దేశంలో దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రామాలయం ఆలయం చుట్టుపక్కల మద్యం షాపుల నిర్వాహకులు అక్రమ మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని మధ్యాహ్నం విక్రయించడం ద్వారా మద్యం సేవించిన వ్యక్తుల వల్లన రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు, సందర్శకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మద్యం మత్తు లో దర్శనానికి వెళుతున్న వారిని ఆటంకం పరుస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకులు భద్రాద్రి శ్రీ సీతారాముల వారిపైన ఉన్న భక్తితో మద్యం నిర్వాహకులను ఏమనలేని దుస్థితి వచ్చింది. ప్రభుత్వ అధికారులు శ్రీ సీతారామచంద్ర దేవస్థానం రామాలయం చుట్టుపక్కల సూపర్ మార్కెట్ బజార్, గ్రామపంచాయతీ కార్యాలయం ప్రక్కన, అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మద్యం బెల్ట్ షాపులను భక్తులకు సందర్శకులకు ఇబ్బంది లేకుండా తొలగించాలని స్థానిక తహసిల్దార్ కి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అలవాల రాజా వినతి పత్రం సమర్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు