భద్రాచలం మే 17
టుడే 9 ప్రతినిధి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం అటానమస్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 11 నుంచి 17 వరకు జరిగిన విద్యా వారోత్సవాలలో భాగంగా చివరి రోజు సి యస్ ఆర్ డోనర్స్, ఇతర దాతల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ అన్నారు.
ఆదివారం నాడు కళాశాలలో చివరి రోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెంగల్ రావు డీజీమ్ ఐటీసీ , పాల్గొని కళాశాల అభివృద్ధి,వసతులు కల్పనలో ఐటిసి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ కూలర్లు అందించిన రోటరీ క్లబ్ తరఫున డి . వి . కె నాయుడు, కంప్యూటర్ ప్రింటర్ ను అందించిన సిపిడిసి మెంబర్ జి . శంకర్రావు, కళాశాలలో పూల కుండీలు,మొక్కలు అందించిన మాగంటి వెంకటేశ్వరరావు, బి . విశ్వనాథ్ అసిస్టెంట్ హెచ్ ఆర్ మేనేజర్ ఐ టి సి పాల్గొని విద్యార్థుల విద్యాభివృద్ధికి, సదుపాయాల కల్పనకు తమ సహకారం ఉంటుందని తెలియజేశారు. కళాశాలలో చదివి చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు సంపాదించిన వారిని ఈ కార్యక్రమంలో భాగంగా అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేత్ర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.









