భద్రాచలం మే 17
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం పట్టణానికి చెందిన డికొండ సాయి మణి కుమార్ తండ్రి పేరు: సురేష్, వయస్సు: 29 సంవత్సరాలు, కులం: మేర, వృత్తి: ప్రైవేటు ఉద్యోగి, నివాసం: రెవిన్యూ కాలని భద్రాచలం అను అతను గత 5 సం:రాల క్రితం బిటెక్ చదివి తరువాత కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసి ప్రస్తుతం ప్రైవేటు జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తేది: 12.05.2026 న రాత్రి సుమారు 09: 00 గంటల సమయంలో తప్పిపోయిన వ్యక్తి యొక్క తల్లి తండ్రులు అతనితో పెళ్లి విషయం గురించి ప్రస్తావించగా అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో, అతను ఎవరికీ చెప్పకుండా అతను ఇంట్లో నుండి వెళ్ళిపొయినాడు. అతని గురించి అతని తల్లి తండ్రులు భద్రాచలం మొత్తం వెతికినా గాని అతని ఆచూకి దొరకకపోయేసరికి తప్పిపోయిన వ్యక్తి యొక్క తండ్రి పిర్యాదు మేరకు భద్రాచలం సబ్ ఇన్స్పెక్టర్ అయిన జి. స్వప్న. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పిపోయిన వ్యక్తి ఎవరికైనా కనిపించినట్లయితే భద్రాచలం పోలీస్ వారికీ సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు.









