భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 19
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు 2002 సంవత్సరంలో ఓటు హక్కు ఉన్నవారు ఇప్పటి ఓటరు జాబితాలో సర్ మ్యాపింగ్ ద్వారా తమ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నది లేనిది సరిచూసుకోవాలని ఐటీడీఏ డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్ అన్నారు.
మంగళవారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఐటీడీఏ లోని వివిధ శాఖల అధికారులు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి సూచనల మేరకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి కొన్ని సూచనలు ఇస్తూ 2002 సంవత్సరంలో ఓటర్ జాబితాలో తమ పేర్లు ఉన్నది లేనిది సరిచూసుకొవాలని లేనియెడల సంబంధిత ఆధారాలు చూపించి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. తమ పేర్లతో పాటు తమ కుటుంబ సభ్యుల పేర్లు మీ చుట్టుపక్కల ఉన్న ఓటర్లకు తెలియజేసి మ్యాపింగ్ ప్రక్రియ చేయించే విధంగా చూడాలని అన్నారు. ప్రస్తుతం భద్రాచలంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ ప్రారంభిస్తున్నారని, ఆ సమయంలో బిఎల్వోలు వారి పరిధిలోని వార్డులలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి ఎన్మరేషన్ ఫారాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఓటర్ జాబితాలో పేర్లు నమోదు విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే అధికారులు దృష్టికి తీసుకొని వస్తే మీ సందేహాలను నివృత్తి చేసి తప్పనిసరిగా ఓటరు జాబితాలో రెవెన్యూ అధికారులు పేర్లు నమోదు అయ్యేవిధంగా సహకరిస్తారని ఆయన తెలుపుతూ ప్రతి ఒక్కరు సర్ మాపింగ్ ప్రక్రియలో ఓటు నమోదు చేసుకునే విధంగా రెవెన్యూ అధికారులకు సహకరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, గురుకులం ఆర్ సి ఓ అరుణకుమారి, ఎస్ డి సి ఆనంద్ కుమార్, పి వి టి జి అధికారి గన్యా, ఎల్ టి ఆర్ డి టి మణిధర్, డి టి ఆర్ వో ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, మేనేజర్ ఆదినారాయణ మరియు ఇతర శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









