బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుంజా సంతోష్ నియామకం…

 

భద్రాచలం, మే 22 : టుడే 9 ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణ బలోపేతంలో భాగంగా, భద్రాచలం పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు  కుంజా సంతోష్‌ను బీజేపీ ఎస్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కుంజా సత్యవతి కుమారుడైన కుంజా సంతోష్, గత తొమ్మిది సంవత్సరాలుగా బీజేపీలో చురుకుగా పనిచేస్తూ సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో విశేష పాత్ర పోషిస్తున్నారు. 2017లో బీజేపీలో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువ మోర్చా కార్యదర్శిగా, భద్రాచలం బీజేపీ మీడియా ఇంచార్జీగా, అనంతరం ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ సందర్భంగా కుంజా సంతోష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వచ్చిన బాధ్యతను కేవలం పార్టీ పదవిగా కాకుండా గిరిజన సమస్యలను రాష్ట్ర స్థాయిలో బలంగా వినిపించే అవకాశంగా తీసుకుంటానని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రవాణా, పరిపాలనా సౌలభ్యాల దృష్ట్యా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న *ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలం నియోజకవర్గంలో విలీనం చేసే అంశంపై కృషి చేస్తానని పేర్కొన్నారు.

అలాగే భద్రాచలం మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న *గుత్తికోయల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

ఇప్పటి వరకు స్థానిక స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేశామని, ఇకపై రాష్ట్ర స్థాయిలో భద్రాచలం మరియు గిరిజన ప్రాంతాల గొంతుకగా పనిచేస్తానని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు