శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  ‘అనంత శ్రీరామే పెద్ద భూకబ్జాదారుడు’: చేగొండి జోగయ్య కుమారుడి సంచలన ఆరోపణలు

ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, ఆయన బంధువు చేగొండి సూర్యప్రకాష్ (చేగొండి జోగయ్య కుమారుడు) మధ్య ఆస్తి వివాదం ముదిరింది. తన తల్లిదండ్రులను సూర్యప్రకాష్ బెదిరిస్తున్నాడంటూ అనంత శ్రీరామ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆ ఆరోపణలను సూర్యప్రకాష్ తీవ్రంగా ఖండించారు. అనంత శ్రీరామ్ తనపై కావాలనే నిరాధారమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని, ఈ విషయంలో ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు సూర్యప్రకాష్ ప్రకటించారు.

ఈ వివాదమంతా ఆస్తికి సంబంధించిందేనని సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. తన తాతయ్య చేగొండి కృష్ణమోహన్ రావుకు చెందిన ఆస్తిని అనంత శ్రీరామ్ అక్రమ మార్గాల్లో స్వాధీనం చేసుకున్నాడని, ఆయనొక “పెద్ద భూ కబ్జా రాయుడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆస్తిని కాజేసేందుకే, తనకు అడ్డు తొలగించుకోవడానికి అనంత శ్రీరామ్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడని ఆయన మండిపడ్డారు.

తాను వృద్ధులైన అనంత శ్రీరామ్ తల్లిదండ్రులను బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సూర్యప్రకాష్ తేల్చి చెప్పారు. తానే గనుక బెదిరించినట్లు ఒక్క ఆధారమైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఒకవైపు ప్రాణభయం ఉందంటూ అనంత శ్రీరామ్ ఫిర్యాదు చేయగా, మరోవైపు సూర్యప్రకాష్ భూకబ్జా ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్తామనడంతో ఈ వివాదం ఇప్పుడు రాజకీయ, న్యాయపరమైన మలుపులు తిరుగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు