దక్షిణ అయోధ్యలో ధ్వంసమైన జాతీయ రహదారులు….

  • దక్షిణ అయోధ్యలో ధ్వంసమైన జాతీయ రహదారులు.
  • పాలకుల నిర్లక్ష్యంతో ప్రమాదాలకు నిలయంగా భద్రాచలం
  • సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి.
  • ధ్వంసం అయిన జాతీయ రహదారిపై.
    సిపిఐఎం ఆధ్వర్యంలో నిరసన.

భద్రాచలం మే 27
టుడే 9 ప్రతినిధి

దక్షిణయోధ్యగా విరజిల్లుతున్న భద్రాచలం పట్టణంలో జాతీయ రహదారులు దారుణంగా ధ్వంసం అయిపోతున్నాయని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో పవిత్ర పుణ్యక్షేత్రం ప్రమాదాలకు నిలయంగా మారిందని నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల మరమ్మతులకు గురైన ప్రమాదాలకు కారణమవుతున్న చర్ల రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ చర్ల వెంకటాపురం మండలాల నుండి వచ్చే ఇసుక లారీలతో భద్రాచలం నుండి వెంకటాపురం వరకు జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసం అయిపోతుందని అన్నారు. ప్రధానంగా భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి నన్నపనేని మోహన్ హైస్కూల్ వరకు తారుతో పోసిన జాతీయ రహదారి విధ్వంసం గా మారిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామయ్య దర్శనానికి వచ్చే యాత్రికులు పర్ణశాలకు వెళ్లాలంటే చుక్కలు కనబడుతున్నాయని ఒక్కసారి ఈ రహదారిపై ప్రయాణించిన యాత్రికులు మరోసారి భద్రాచలం పేరు ఎత్తితేనే భయపడిపోయే పరిస్థితులు వచ్చాయని అన్నారు. జాతీయ రహదారుల మరమ్మతులు చేపట్టాలని సిపిఐఎం ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా దశల వారి ఉద్యమాలను చేస్తున్న పాలకులు స్పందించడం లేదని అన్నారు. సిపిఎం జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వం పలుమార్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోపాటు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు వినతి పత్రాలు అందించారని నర్సారెడ్డి సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి తోపాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన హామీ ప్రకటనలకే పరిమితమైందని ఇప్పటివరకు రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం చొరవ చూపలేదని నర్సారెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఈ రహదారిపైనే జరిగిన పాలకులు స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రజా పాలన ప్రగతి పాలన పేరుతో సొంత ప్రచారాలు చేసుకుంటున్న ప్రభుత్వం దక్షిణాయోధ్య రహదారులపై శ్రద్ధ చూపాలని నరసారెడ్డి హితవు పలికారు. యుద్ధ ప్రాతిపదికన భద్రాచలం పట్టణంలోని జాతీయ రహదారి మరమ్మతులు పనులు చేపట్టకపోతే సిపిఐ ఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి పట్టణ కమిటీ సభ్యులు నకిరేకంటి నాగరాజు ఎస్ఎఫ్ఐ నాయకులు రవీందర్ పార్టీ నాయకులు అంజి భూషణం శ్రీను రమేషు తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు