భద్రాచలం మే 27 రేపు
టుడే 9 ప్రతినిధి
తల్లి నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన, మీ భవిష్యత్తును బాగు చేయడానికి మీ తండ్రి ఎంత కష్టపడ్డాడో దానికి ప్రతిఫలం 10వ తరగతిలో మీరు సాధించిన మార్కులు వారు పడ్డ కష్టానికి మంచి గుర్తింపు తెచ్చాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధ వారం నాడు ఐటీడీఏ సమావేశం మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు. గురుకులం కళాశాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు చదివి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు సన్మానంతో పాటు ప్రశంసా పత్రాలు పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మీకు జన్మనిచ్చింది తల్లిదండ్రుల అయిన తల్లిదండ్రుల తర్వాత గురువులు కూడా తల్లిదండ్రుల పాత్ర పోషించి మీ మంచి చెడ్డలు చూసుకుంటూ10 సంవత్సరాలు విద్యాబుద్ధులు నేర్పించి మీ యొక్క భవిష్యత్తును బంగారు బాటలో తేవడానికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదివిన విద్యార్థినీ విద్యార్థులు సాధించిన మార్కులు తెలంగాణ రాష్ట్రంలోనే మన జిల్లాకు మంచి పేరు వచ్చిందని, పదవ తరగతిలో మంచి మార్కులు సాధించినంత మాత్రాన ఇంతటితో మీ జైత్రయాత్ర ఆపకూడదని, రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కులతో ఎంసెట్, నీట్, జేఈఈ. ఇతర గ్రూప్స్ రాయడానికి ఎంతో ఉపకరిస్తాయని ఆ దిశగా ఈ రెండు సంవత్సరాలు కష్టపడి చదవాలని పిల్లలకు సూచించారు. ఎంపీసీ, బైపిసి చదివిన పిల్లలు బీటెక్, ఎంబీబీఎస్ కోర్సులు చేయడానికి ఉపకరిస్తాయని, సిఇసి, హెచ్ఈసి చదివిన పిల్లలు గ్రూప్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వారికి సివిల్స్ ఎంట్రెన్స్ రాసేవారికి దాదాపు 50 శాతం ప్రశ్నలు ఈ కోర్సులు చదివిన వారికి తప్పకుండా వస్తాయని ఆ దిశగా మీరు అనుకున్న సబ్జెక్టు తీసుకొని బాగా చదివి వృద్ధిలోకి రావాలని అన్నారు. ఇంటర్మీడియట్ చదువుకుంటూనే మీ యొక్క కెరీర్ పై దృష్టి సారించి మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు. మీ గ్రామానికి మీకు చదువు నేర్పిన గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని ఆయన అన్నారు.
అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో పదవ తరగతి పరీక్షలలో 550 పైన మార్కులు సాధించిన 19 మంది బాల బాలికలకు, ఖమ్మం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల నుండి ఇద్దరు అలాగే 550 పైన మార్కులు సాధించిన నలుగురు బాలురు, ఐదుగురు బాలికలకు, గురుకులం పాఠశాలలో ఎనిమిది మంది బాలురు, ఇద్దరు బాలికలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఐదుగురు బాలురు, నలుగురు బాలికలు, ఇంటర్ రెండవ సంవత్సరంలో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు, జేఈఈ మెయిన్స్ ఐదుగురు బాలురు, ఎఫ్ సెట్ అగ్రికల్చర్ ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు, ఎఫ్ సెట్ ఇంజనీరింగ్ నలుగురు బాలురు, ఒక బాలిక అత్యుత్తమ మార్కులు సాధించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అశోక్, విజయలక్ష్మి, ఏ సి ఎం ఓ లు రమేష్, రాములు, ఏ టి డి ఓ చంద్రమోహన్, భారతీదేవి, క్రీడల అధికారి గోపాలరావు మరియు ప్రిన్సిపాల్ లు, హెచ్ఎంలు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.









