ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పని తీరుపై ప్రత్యేక సమావేశం.
పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు. ఐటిడిఏ పిఓ బి రాహుల్.
భద్రాచలం మే 27
టుడే 9 ప్రతినిధి
నాలుగు రాష్ట్రాల అనుసంధానంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వారికి సరైన వైద్య చికిత్సలు అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు . వైద్యశాఖ అధికారులతో కలిసి భద్రాచలం ఏరియా ఆసుపత్రి పనితీరుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి పేరు ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ఈమధ్య చాలా వరకు కంప్లైంట్ లు వస్తున్నాయని ఇకముందు ఎటువంటి కంప్లైంట్ లు రాకుండా డాక్టర్లు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని, అలాగే ఆసుపత్రిలో డెలివరీ అయిన వారి దగ్గర డబ్బులు అడుగుతున్నట్లు, ప్రైవేట్ లో పనిచేసే వారిని ఓపిలో కూర్చో పెట్టి పనులు చేయిస్తున్నట్లు అలాగే బయట నుండి వచ్చిన నర్సులు అక్కడ ఉన్న సిబ్బందికి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు, నా దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రికి మెటీరియల్ కొనుగోలుకు 35 లక్షల రూపాయలు పీహెచ్ లకు 10 లక్షల రూపాయలు త్వరలో మంజూరు అవుతున్నందున కావాల్సిన మెటీరియల్ తీసుకొని పేషెంట్లకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని, డాక్టర్లు సిబ్బంది ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తప్పనిసరిగా విధులలో ఉండాలని, విధులు అయిపోయిన తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్పందించాలని, విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి కనబరిస్తే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
అనంతరం భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు మాట్లాడుతూ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చాలా మంచి పేరు ఉందని ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీలు కూడా ఆసుపత్రి పై నమ్మకముతో ఇక్కడే డెలివరీలు చేయించారని అటువంటి పేరు ఉన్న ఆసుపత్రికి సిబ్బంది నిర్లక్ష్యం వలన చెడ్డ పేరు వచ్చే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, డాక్టర్లు స్టాప్ నర్సులు మీరు చేసే పని ప్రతిదీ రికార్డులో నమోదు చేయాలని, డాక్టర్లు పేషెంట్లను చూసి వెళ్లిపోయిన తర్వాత పేషంట్లతో ప్రేమగా వ్యవహరించాలని పేషెంట్లకు వారికి ఉన్న జబ్బుకు గురించి కౌన్సిలింగ్ ఇచ్చి సలహాలు సూచనలు అందించాలని అన్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు సిబ్బంది తప్పనిసరిగా యూనిఫాం మెయింటైన్ చేయాలని అన్నారు. అలాగే శానిటేషన్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా పేషెంట్లకు పేషెంట్లతోపాటు వచ్చిన అటెండర్ లకు ఆసుపత్రి మెనూ ప్రకారం అల్పాహారం మొదలుకొని రాత్రి భోజనం వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఏరియా ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు సమన్వయంతో పనిచేసి మంచి పేరు తీసుకుని రావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్వో సైదులు, డి సి హెచ్ రవిబాబు, ఆర్ ఎం ఓ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్లు, హెడ్ నర్స్, జి ఎన్ ఎమ్ స్టాఫ్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.









