శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్ 13
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం తెలంగాణ టూరిజం నందు ఉస్మానియా విద్యార్థి జేఏసీ (జనరల్) రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ అలాగే భద్రాద్రి యోజన అభివృద్ధి ఫోరం గౌరవ అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో రాజపేట లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ అనేది బిఎస్ రావు శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ లా? లేక బిఎస్ రావుకు సంబంధం లేని శ్రీ చైతన్య అనే పేరు కలిగిన స్కూలా అనేది స్కూల్ యాజమాన్యం వివరణ ఇవ్వాలని, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్ని ంచారు. అలాగే విద్యార్థి ల తల్లిదండ్రులందరూ కూడా ఇది బిఎస్ రావు శ్రీ చైతన్య నా కాదో వివరణ తెలుసుకొని ఫీజులు కట్టాలని తెలియజేశారు. అలాగే జిల్లా డీఈవో, మండల ఎంఈఓ తక్షణమే ఇది బిఎస్ రావు శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూలా కాదా వివరణ ఇవ్వాలి అలాగే డీఈవో ఎంఈఓ సమర్పించినటువంటి విద్యార్థుల స్కూల్ తరగతి వారి ఫీజుల వివరాలు తెలపాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ కోరారు.
ఈ కార్యక్రమంలో, బండారు కృష్ణ , చింత నాగ ముత్యం, పైలా సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు