గిరిజన ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలి.

  • గిరిజన ప్రజల సమస్యలు
    త్వరగా పరిష్కరించాలి.
  • ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు
    అధికారి డేవిడ్ రాజ్.

భద్రాచలం జూన్ 15
టుడే 9 ప్రతినిధి

సుదూర ఆదివాసి గిరిజన గ్రామాల నుండి గిరిజన దర్బార్ లో దరఖాస్తులు చేసుకొన్న గిరిజనులకు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
సోమవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బారులో ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుండి ఆయన యూనిట్ అధికారుల సమక్షంలో అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ వీలైనంత తొందరగా అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈరోజు గిరిజనులు గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలలో పొడు భూముల పట్టాలలో పేర్లు మార్పు కొరకు, రైతుబంధు రుణాల కొరకు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు. గిరిజన గ్రామాలలో వ్యవసాయం చేసుకోవడానికి కరెంటు, బోరు, మోటారు కొరకు . మారుమూల గిరిజన గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించుట కొరకు, నూతనంగా మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేసుకొనుట కొరకు, దీర్ఘకాలిక జబ్బులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి శిక్షణలు ఇప్పించుట కొరకు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించుట కొరకు, కుటుంబాన్ని పోషించుకోవడానికి డైలీ వేజ్ వర్కర్ గా అవకాశం కల్పించడం కొరకు, గురుకుల పాఠశాలల్లో సీట్లు ఇప్పించుట కొరకు, సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, తమ పొలాలలో బోర్లు తవ్వించుకోవడానికి అనుమతి కొరకు గిరిజనులు అర్జీలు సమర్పించారని ఆయన అన్నారు.

గిరిజన దర్బార్ లో సమర్పించిన అర్జీలు అన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ డి సి ఆనంద్ కుమార్, ఏటీడీఓ/ పీసా అధికారి అశోక్, ఏవో సున్నం రాంబాబు, కొండరెడ్ల అధికారి గన్యా, ఏపీఓ పవర్ వేణు, ఏ డి ఎమ్ హెచ్ ఓ సైదులు, హౌసింగ్ ఏఈ హేమంత్, జేడీఎం హరికృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవితేజ, మేనేజర్ ఆదినారాయణ, హెచ్ ఈ ఓ లింగా నాయక్, ఐసిడిఎస్ సూపర్వైజర్ చంద్రకళ, ఇతర శాఖల సిబ్బంది నాగేశ్వరరావు, ప్రసాద్, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు