ఇందిరమ్మ ఇంటి పెండింగ్ బిల్లలను విడుదల చేయాలి.:ఎం ఎం ఎస్. నాయకులు మేకల లత.

ఇందిరమ్మ ఇంటి పెండింగ్ బిల్లలను విడుదల చేయాలి.:ఎం ఎం ఎస్. నాయకులు మేకల లత.

భద్రాచలం జూన్ 15
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరు మీద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మేకల లత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు తమ సొంత ఇంటి కలలు నెరవేర్చుకునేందుకు అప్పులు చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడితే ప్రభుత్వం సరైన సమయంలో పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల వడ్డీల భారంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం ఇస్తామన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ఖర్చు బిల్లులను పూర్తిగా సకాలంలో అందిస్తే పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పూర్తి బిల్లుని అకాలంలో విడుదల చేసి ఆదుకోవాలని లేనిపక్షంలో మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు