భద్రాచలం జూన్ 15
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సుదీర్ఘకాలం పాటు విశేష వైద్య సేవలను అందించి, ప్రజల గుండెల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్న డాక్టర్ ఎం.వి. కోటిరెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం రాఘవ నిలయం భద్రాచలంలో అత్యంత ఘనంగా జరిగింది.
భద్రాచలం రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సన్మాన మహోత్సవంలో పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, మిత్రులు ఆయన కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ కోటిరెడ్డి సేవలను కొనియాడారు. వైద్య రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలు, ఆయనకున్న నిరాడంబర వ్యక్తిత్వం రోగుల పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని వక్తలు ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా పలువురు రెడ్డి సోదరులు మాట్లాడుతూ. ఏజెన్సీ ప్రాంతమైన, గిరిజనులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించే ఈ భద్రాచలంలో, నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలకు డాక్టర్ కోటిరెడ్డి గత 12 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు నాణ్యమైన వైద్యం అందించి ప్రజల గుండెల్లో నిలిచారు. ఈ ఘనత ఒక్క డాక్టర్ కోటిరెడ్డికే దక్కుతుంది” అని కొనియాడారు. ఇంతటి మంచి పేరు తెచ్చిన కోటిరెడ్డి తల్లిదండ్రులకు వక్తలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.
అనంతరం డాక్టర్ కోటిరెడ్డి దంపతులను గజమాలతో, శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ ఆయన పదవీ విరమణ జీవితం సుఖసంతోషాలతో, ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని ఆ రామచంద్ర మహాప్రభువును ఆకాంక్షిస్తూ ప్రార్థించారు.
ఈ కార్యక్రమం భద్రాచలం రెడ్డి భవన్ కన్వీనర్ మందపాటి సుధాకర్ రెడ్డి, ఈసీ మెంబర్ బోగాల శ్రీనివాస్ రెడ్డి, ఆడిట్ మెంబర్ జి.వి. రమణా రెడ్డి, సభ్యులు క్వెస్ట్ రాజా రెడ్డి మరియు మారం వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి ప్రముఖులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి, గాదె మాధవ రెడ్డి, బిలిపెల్లి రంగారెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బి.వి. రమణా రెడ్డి, మోర్తాల సిద్ధారెడ్డి, రామకృష్ణ రెడ్డి, సిపిఎం పార్టీ బాల నర్సారెడ్డి, జక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ రామిరెడ్డి, అన్నెం కోటి రెడ్డి, సూర్య హాస్పటల్ జయచంద్రా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చైతన్య రెడ్డి,బి.ఆర్.టి.యు. జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్ రెడ్డి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏరియా హాస్పిటల్ సుపెరిడెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ నరసింహ రెడ్డి, డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ యుగంధర్ రెడ్డి, డాక్టర్ సుకృత, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ పవన్ రెడ్డి, గీతా పావని, , డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ సాయి తేజ్ రెడ్డి దంపతులు మరియు రెడ్డి నియోజకవర్గ సోదర సోదరీమణులు దంపతులతో సహా పాల్గొని కోటిరెడ్డి కి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని శుభాకాంక్షలు తెలియజేశారు.









