వితంతువులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం….

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 62.34 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధిక మొత్తంలో పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని స్పష్టం చేశారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే, భార్యకు తక్షణమే ‘స్పౌజ్ కేటగిరీ’ కింద పెన్షన్ బదిలీ చేస్తున్నామని, దీనివల్ల ఇప్పటికే 2.45 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని ఆయన వివరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లను భారీగా తొలగిస్తోందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి తోసిపుచ్చారు. గత వైకాపా ప్రభుత్వం ఏకంగా 9.56 లక్షల పింఛన్లను తొలగిస్తే, తాము కేవలం నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన చేసి 7,856 అనర్హుల పింఛన్లను మాత్రమే పక్కన పెట్టామని స్పష్టం చేశారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల పింఛన్లను ఎక్కడా రద్దు చేయలేదని మంత్రి తేల్చి చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు