లక్ష మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి:ఐ టి డి ఏ పి ఓ బీ రాహుల్.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జూలై 19
టుడే 9 ప్రతినిధి

ప్రతి మనిషి దైనందన జీవితంలో భాగంగా ఎటువంటి రుగ్మతలు దరిచేరనీయకుండా ఉండాలంటే పర్యావరణం పచ్చధనం పరిశుభ్రంగా ఉండాలంటే తప్పనిసరిగా పర్యావరణాన్ని కాపాడుకొనుటకు విరివిగా ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

శుక్రవారం నాడు తన చాంబర్లో ఫారెస్ట్, ఐ టి సి, ఎం ఎన్ ఆర్ ఏ జి ఎస్ గ్రామ పంచాయతీ అధికారులతో కలిసి సారపాక గ్రామపంచాయతీలో లక్షల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడానికి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో పర్యావరణం కలుషితం కాకుండా సారపాక గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో వనమహోత్సవంలో భాగంగా సంవత్సరానికి 25 వేల మొక్కలు చొప్పున నాలుగు సంవత్సరాలకు లక్ష మొక్కలు సారపాక లోని ప్రజలు ఎక్కువగా సంచరించే ఖాళీ ప్రదేశాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలో ముఖ్యమైన కూడళ్లలో ప్రజలకు ఉపయోగపడే మరియు కార్బన్డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ అందించే మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకునే విధంగా సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ముఖ్యంగా గానుగ, వేప, చింత, జామ, నేరేడు చెట్లతోపాటు వివిధ రకాల పండ్లకు సంబంధించిన మొక్కలను నాటాలని అన్నారు. లక్ష మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను పగడ్బందీగా తీసుకోవడానికి ఫారెస్ట్,ఐటిసి, ఎంఆర్ఇజిఎస్ అధికారులు గ్రామపంచాయతీ వారికి వివిధ రకాలు మొక్కలు అందించి వాటిని క్రమమైన పద్ధతిలో నాటించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం అవ్వడానికి సహకరించాలని ఆయన అన్నారు. అలాగే ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి గ్రామాలలో .ప్రభుత్వ కార్యాలయాలలో మనకు ప్రాణవాయువును ప్రసాదించే చెట్లను నాటి వాటిని సక్రమంగా పెంచి వాతావరణం కలుషితం కాకుండా చూడాలని అన్నారు. చెట్లను పెంచడం వలన పరిసరాలు శుభ్రంగా ఉండి మనకు ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని అందుకుప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్రాణవాయువు ఇచ్చే మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని, పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందని, మానవాళి అంతా ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు పచ్చదనంతో కళకళలాడాలని, అందుకు తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, సారపాక సర్పంచ్ కిషోర్ శివరామ నాయక్, ఫారెస్ట్ డిఆర్ఓ ధారావత్ కృష్ణ, ఐటిసి డిప్యూటీ జిఎం విశ్వనాథం,ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు