జ్యూడిషల్ కోర్టు ఆవరణలో లోక్ ఆదాలత్ కార్యక్రమం…

 

భద్రాచలం జూలై 20
టుడే 9 ప్రతినిధి

ఈరోజు భద్రాచలం జ్యుడీషియల్ కోర్టు ఆవరణలో లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్ కార్యదర్శి పూసాల శ్రీనివాసచారి సభ్యులు పేరాల నాగరాజు రిక్వెస్ట్ మేరకు ప్రముఖ సామాజికవేత్త గాదె మాధవరెడ్డి కక్షిదారులకు సుమారు 350 మందికి పులిహార ప్యాకెట్లను అందించడం చాలా సంతోషకరమని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీ శివ నాయక్ ఇంకో మేజిస్ట్రేట్ దుర్గ భవాని అడిషనల్ మేజిస్ట్రేట్ రాందాస్ ఇటువంటి సేవా దృక్పథం ఉండటం ఎంతో సంతోషమని మాధవరెడ్డిని అభినందించారు
బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివా స్ మాట్లాడుతూ
మా కోర్టు ఆవరణలో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరిగినా మీరు ముందుంటారని అలాగే రాబోవు రోజుల్లో కూడా మీరు ఎప్పుడూ మాకు సహకరించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాల శ్రీనివాసన్ అభిలాషించారు అలాగే ఈరోజు జరిగినటువంటి పులిహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమానికి గాదె మాధవ రెడ్డి ని శాలువాతో సత్కరించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు కచ్చిదారులు న్యాయవాదులు అలాగే పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని చాలా పెద్ద మొత్తంలో కేసులు పరిష్కారం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు