గవర్నమెంట్ ప్రైమరీ మోడల్ స్కూల్ కు ఐటిడిఏ నుండి డెవలప్మెంట్ నిధులు వెంటనే మంజూరు చేయాలి…

  • గవర్నమెంట్ ప్రైమరీ మోడల్ స్కూల్ కు ఐటిడిఏ నుండి డెవలప్మెంట్ నిధులు వెంటనే మంజూరు చేయాలి.
  • పాఠశాల సమస్యలపై సిపిఎం బృందం సర్వే.

భద్రాచలం జూన్ 30
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం పట్టణం రాజుపేట లోని గవర్నమెంట్ ప్రైమరీ మోడల్ స్కూల్ అభివృద్ధికి ఐటిడిఏ నుండి నిధులు కేటాయించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు కోరారు. ఈరోజు గవర్నమెంట్ ప్రైమరీ మోడల్ స్కూల్ సమస్యలపై సిపిఎం బృందం సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో పలు సమస్యలు బృందం దృష్టికి రావడం జరిగింది. స్కూల్ నందు నిర్మించిన బాత్రూములు డామేజ్ అయ్యాయని వాటిని పునర్నిర్మించాలని, స్కావెంజర్ లేకపోవడంతో బాత్రూంలు తీవ్రదుర్గంధంతో వాడలేని పరిస్థితి ఉన్నదని వెంటనే స్కావెంజర్ పోస్టును భర్తీ చేయాలని వారు కోరారు. పిల్లలకు స్కూల్ యూనిఫామ్ ఇంకా ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రైమరీ స్కూల్ నందు ఒకటి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చినప్పటికీ ఇంకా నోట్ బుక్స్ ఇవ్వలేదని నోట్బుక్స్ వెంటనే అందచేయాలని అన్నారు. భద్రాచలం మండలంలో ఐటీడీఏ బాధ్యతతో నడుస్తున్న గవర్నమెంట్ ప్రైమరీ మోడల్ స్కూల్ ఇది ఒక్కటేనని దీనిని మిగతా అన్ని స్కూల్స్ కి భిన్నంగా చూపించాల్సిన బాధ్యత ఐటిడిఏ మీద ఉన్నదని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే పెడుతున్నప్పటికీ మిడ్ డే మీల్ వర్కర్ కి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని అన్నారు. ఈ సర్వే బృందంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి దేవగుప్త కనక శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు