భద్రాచలం: జులై 1:
టుడే 9 ప్రతినిధి
రోటరీ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు షేక్ అజీమ్, కార్యదర్శి పాపినేని శ్రీనాథ్ రాజేష్ ట్రెజరర్ కొత్త రామకృష్ణ ఆధ్వర్యంలో రాఘవ నిలయం రెడ్డి సత్రంలో ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా విశేష సేవలు అందించిన ప్రముఖ 20 మంది వైద్యుల్ని ఘనంగా సన్మానించడం సన్మానించారు రోటరీ పెద్దలు డాక్టర్లు మాట్లాడుతూ డాక్టర్ చందర్రాయి ఒక డాక్టర్ కాక స్వతంత్ర సమరయోధుడు పశ్చిమబెంగాల్ కు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి వైద్య రంగంలో విశేష సేవలు అందించి ప్రజా ఆరోగ్య అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన జన్మదినం వర్ధంతి జులై 1 తారీకున రావటం తో. ఆయన్ని స్మరించుకుంటూ వైద్య సేవలో ప్రజాసేవలో ఆయన విశేష మైనవి కృషికి ఆయనకు భారత ప్రభుత్వం 1961 లో భారతరత్నతో సత్కరించడం జరిగిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు షేక్ అజీమ్, కార్యదర్శి పాపినేని రాజేష్, ట్రెజరర్ కొత్త రామకృష్ణ, పూర్వ అధ్యక్షులు డాక్టర్ సోమయ్య, జకరయ్య, నాగేశ్వరరావు, మధు, రఫీ, మోత్కూరు వీరయ్య, గ్లాడ్ స్టోన్ చైతన్య రెడ్డి శేష్ కుమార్, సాగర్, సన్మాన గ్రహీతలు డాక్టర్ సోమయ్య, డాక్టర్ కోటిరెడ్డి, అజిత్ రెడ్డి, డాక్టర్ భరణి, డాక్టర్ సంతోష్, అక్కినేని లోకేష్, సూరపనేని శ్రీకాంత్, డాక్టర్ ముదిగొండ రామకృష్ణ డాక్టర్ పవన్ రెడ్డి, డాక్టర్ గీతామాధురి, డాక్టర్ అలీనా శాంతి, డాక్టర్ రోశయ్య, డాక్టర్ శివ రాహుల్, డాక్టర్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు









