*ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం*
*144వ బూత్‌లో ఓటర్లకు ఫారాలు పంపిణీ*
భద్రాచలం, జూలై 4:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని 144వ పోలింగ్ బూత్ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) ప్రేమ్ కుమార్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ 144వ బూత్ బీఎల్ఏ, 4వ వార్డు ఇన్చార్జి రేపాక సాయి అఖిల్ ఓటర్లకు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రేపాక సాయి అఖిల్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో ఏవైనా మార్పులు అవసరమైతే సంబంధిత ఫారాలను సకాలంలో సమర్పించాలని సూచించారు. ప్రజలు ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో బీఎల్ఓ ప్రేమ్ కుమార్‌తో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొని ఓటర్లకు అవసరమైన సూచనలు అందించారు.
జర్నలిస్ట్:D.Vinesh









