నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామానికి వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూసిన నేపథ్యంలో, ఆయన కుటుంబాన్ని స్వయంగా ఓదార్చి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందనే భరోసా ఇవ్వనున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అత్యంత ఆప్తుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే రూ. 2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా పెద్ది కుటుంబంతో పాటు స్థానిక నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కూడా కేసీఆర్ మాట్లాడనున్నారు.









