భద్రాచలం పట్టణం లో దారుణ ఘటన చోటు చేసుకుంది.మద్యం మత్తులో జరిగిన దాడిలో ఒక యువకుడి మృతికి కారణం అయ్యింది.వివరాల్లోకి వెళితే,భద్రాచలం చర్ల రోడ్డు వైన్ షాపుల ఎదురుగా మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రవి వర్మ అనే వ్యక్తిపై కొందరు యువకులు మారణాయుధాలతో దాడి చేశారు.దాడిలో రవి వర్మ తీవ్రంగా గాయ పడ్డారు,
దాడికి పాల్పడ్డ యువకులు నిర్భయంగా నడుచుకుంటూ అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయిన అనంతరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవి వర్మను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రవి వర్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.








